శుక్రవారం షాబాద్ మండలంలోని అంతారం గేట్ వద్ద కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ క్యాబిన్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపి సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. మంటలు వ్యాపించి టిప్పర్ ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.