హైదరాబాద్ బీఆర్‌కే భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి మెయిన్ గేట్ వద్ద నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గేటు వద్ద గుమిగూడిన కార్యకర్తలను లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు.