యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, భారీ ఎత్తున మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కారులలో 107 లీటర్ల మద్యం తరలిస్తున్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 3 కార్లు, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.