ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 3కేజీల గంజాయి పట్టివేత

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పోలీసులు మంగళపల్లి క్రాస్ రోడ్ వద్ద గంజాయి విక్రయిస్తున్న సయ్యద్ సమీర్ (26) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన నిందితుడు ఎలక్ట్రీషియన్, ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నాడు. అతనిపై గతంలో నాంపల్లి, వారాసిగూడ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. నిందితుడు గంజాయిని సేకరించి విక్రయించడమే కాకుండా, స్వయంగా వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్