రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని బండ రావిరాల గ్రామంలో ప్రతిపాదించిన 494 ఎకరాల ఎకో టౌన్‌ను రద్దు చేయాలని బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌లోకి ప్రవేశించి నిరసన తెలిపిన రైతులు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి, ఎకో టౌన్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.