గుర్తింపు పొందిన స్టాక్ మార్కెట్ ఎనలిస్టులమని నమ్మించి, తమ సూచనలతో పెట్టుబడి పెడితే వంద శాతం లాభాలు వస్తాయని చెప్పి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని రూ.37 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టించి మోసగించిన ఘటన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దృష్టికి వచ్చింది. ఫిబ్రవరిలో బిలాల్, మయాంక్ అనే వ్యక్తులు సెబీ గుర్తింపు పొందిన ఎనలిస్టులమని పరిచయం చేసుకుని, నారాయణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని నమ్మించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టించారు. భారీ నష్టం రావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.