రంగారెడ్డి జిల్లా యాచారం పీఏస్ పరిధిలో నివాసం ఉంటున్న ఒంటరి వృద్ధురాలు (90)పై అత్యాచారం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిని రాత్రి 12 గంటలకు వచ్చి తలుపు తట్టి, నిద్ర లేపి విచక్షణారహితంగా యువకులు దాడి చేశారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన పని మనిషి తలుపు తెరిచి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధురాలిని చూసి భయంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చింది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.