మంచాల మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్, బహుదూర్ తెలిపారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి సైతం రానున్నట్లు వివరించారు. గ్రామాల్లో ప్రతి బూత్ కమిటీ నుంచి 20 మందికిపైగా కార్యకర్తలు రావాలని సూచించారు.