ఇబ్రహీంపట్నం: విద్యార్థిని ఆత్మహత్య

ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ భవనంలో ఐలూరి భావన (20) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. భావన సీఎస్సీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతురాలు ఖమ్మం జిల్లా కుర్ణవెళ్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంబంధిత పోస్ట్