ఇసుక దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదిబట్లలో ఇసుక బజార్ ను ప్రారంభించారు. ప్రభుత్వ ఖనిజాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇసుక బజార్ కొనసాగుతుందని తెలిపారు. దోపిడీ, దళారీ వ్యవస్థను రూపుమా పేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారని స్పష్టం చేశారు.