శనివారం రాత్రి ఇబ్రహీంపట్నం రాందాసుపల్లి గ్రామ శివార్లలో అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్న మూడు టిప్పర్ లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ సునితారెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. పట్టుబడిన లారీలను పోలీసులకు అప్పగించారు.