కేశంపేట: పెన్షన్ల పంపిణీపై ఆకస్మిక తనిఖీ

కేశంపేట మండలంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంపీడీవో కిష్టయ్య మండలంలోని కేశంపేట వేములనర్వ, సంగెం, పుట్టవానిగూడ గ్రామపంచాయతీలను శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పెన్షన్ల పంపిణీ విధానాలను పరిశీలించారు. ప్రస్తుతం పెన్షన్లు ఫేషియల్ రికగ్నిషన్ విధానంతో జారీ అవుతున్నాయి. ఇప్పటికే సుమారు 70% శాతం పెన్షన్లు పంపిణీ పూర్తయ్యాయి. శనివారం చివరి రోజని బీజీఎంకు స్పష్టంగా ఆదేశించారు.

సంబంధిత పోస్ట్