సీనియర్ జర్నలిస్టు వై. నాగరాజు (60) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. నాగరాజుకు భార్య, ఒక కూతురు. 1990లో ఆంధ్రజ్యోతిలో కూకట్ పల్లి ఏరియా రిపోర్టర్ గా చేరిన నాగరాజు పాతికేళ్ళుగా వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేశారు. నాగరాజు మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.