పట్నం మహేందర్ రెడ్డికి మేడిపల్లి సర్పంచ్ మొర

మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామ సర్పంచ్ ఎం. శ్రీనివాస్, వార్డు సభ్యులు శనివారం శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిని కలిసి, గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తమ విద్యార్థుల భవిష్యత్తుకు శాపంగా మారుతుందని విన్నవించారు. బంజారాహిల్స్ లోని మహేందర్ రెడ్డి నివాసానికి వచ్చి పాఠశాల సమస్యలను వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా కొన్ని సబ్జెక్టులలో బోధించేవారు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, తీవ్రంగా నష్టపోతున్నారని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్