రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన ధాన్యం..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఇబ్రహీంపట్నం, నోముల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అర్ధరాత్రి కురిసిన వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈదురుగాలులతో కూడిన వర్షానికి ధాన్యంపై ఉన్న కవర్లు ఎగిరిపోయి ధాన్యం తడిసింది. నోముల గ్రామ పరిధిలో ఎండపోసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకపోవడం, సమయం వృధా చేయడం వల్లే రాత్రి కురిసిన వర్షానికి వడ్లు తడిసిపోయాయని, తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్