శ్రీ విశ్వకర్మ జయంతి: రాజస్థాన్ భవన్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు

రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ పరిధిలోని లక్ష్మీగూడాలో శ్రీ మల్లికార్జున నగర్‌లో గల రాజస్థాన్ భవన్‌లో జంగడి సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వకర్మ జయంతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు మల్లికార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆడికి మహేందర్ రామేశ్వరుజి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాలనీ ప్రతినిధులు, జంగడి సమాజ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశ్వకర్మ దేవునికి పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్