వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో భర్త సుదర్శన్ వేధింపులు తట్టుకోలేక జోగు సంధ్య అనే వివాహిత మంగళవారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సుదర్శన్ ఆటో డ్రైవర్ కాగా, సంధ్య కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. సుదర్శన్ రోజూ తాగి వచ్చి డబ్బులు అడగడం, భార్యను కొట్టడం వంటివి చేసేవాడని, 15 ఏళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. గతంలోనూ సంధ్య ఆత్మహత్యాయత్నం చేసిందని, పోలీసు ఫిర్యాదులు కూడా వెనక్కి తీసుకున్నారని సమాచారం. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సంధ్య మృతి చెందింది. కూతురు, కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్