గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాల ప్రకారం ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు (22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.