రాయదుర్గంలో యువకుడు ఆత్మహత్య

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాకు చెందిన వర్మ ప్రధాన్ (30) అపర్ణ కన్స్ స్ట్రక్షన్ లో క్రేన్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమ వివాదం కారణంగా, ప్రియురాలికి వీడియో సందేశం పంపించి జీవితాన్ని ముగించుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించారు.

సంబంధిత పోస్ట్