బాలానగర్ లో ఎక్సైజ్ హెచ్ డి ఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయిని తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పవన్కళ్యాణ్, పృథ్వీ స్కూటీపై గంజాయిని తీసుకెళ్తుండగా వారినుంచి 1. 252 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, గంజాయిని బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.