సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం చిల్లకూరు జాతీయ రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన దంపతులు తిరుమల దర్శనం ముగించుకుని కారులో వెళుతూ.. ఆగి ఉన్న లారీని అతివేగంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భార్యా భర్తలు ఇద్దరు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగరాజు మృతదేహాలను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.