కూకట్‌పల్లి: కారును ఢీ కొట్టిన బైక్.. యువకుడు మృతి (వీడియో)

KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెమ్మదిగా వెళ్తున్న కారును వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో, బైక్‌పై ఉన్న వ్యక్తి గాల్లోకి ఎగిరి కిందపడిపోయాడు. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలైన బైక్ స్వారీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై KPHB పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వేగాన్ని నియంత్రించి, ప్రాణాలను కాపాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్