లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కళాశాల అసోసియేట్ డీన్ మంతని గోవర్ధన్, విత్తన కంపెనీ లైసెన్స్ ఇప్పించేందుకు లక్షా 25 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బాధితుడు విత్తన కంపెనీ లైసెన్స్ కోసం మార్చి 2025లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అధికారులు జాప్యం చేయడంతో అసోసియేట్ డీన్ ను ఆశ్రయించాడు. బాధితుడు ముందుగా 25 వేల రూపాయలు యూపీఐ ద్వారా చెల్లించగా, మిగిలిన లక్ష రూపాయల కోసం గోవర్ధన్ ఒత్తిడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, గోవర్ధన్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఎల్బీనగర్ లోని అతని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్