రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిల్‌లోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఆదర్శ కాలనీలో ఉన్న శ్రీ గాయత్రి పొదుపు సంఘం 26వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించబడింది. 2000 సంవత్సరంలో 14 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంఘం ప్రస్తుతం 681 మంది సభ్యులతో రూ. 5.55 కోట్ల నిధులతో అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా సంఘ కార్యకలాపాలపై సభ్యులకు అవగాహన కల్పించారు.