విధి నిర్వహణలో పోలీసులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారని వారి ఆరోగ్యాన్ని కాపాడటం కోసమే హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు వారి ఆరోగ్య రక్షణ కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు.