హైదరాబాద్ వనస్థలిపురం సరస్వతినగర్ ఎస్‌ఎన్‌ఆర్ అపార్ట్‌మెంట్ నుండి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పాలడుగు నారాయణను దుండగులు కారులో కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ కిడ్నాప్‌కు మేడ్చల్, కుత్బుల్లాపూర్‌లోని ఒక భూవివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.