హైదరాబాద్: నాపై హత్యాయత్నానికి సీఐ కుట్ర: తీన్మార్ మల్లన్న

మేడిపల్లి పరిధిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిలో సీఐ గోవిందరెడ్డి కుట్ర ఉన్నట్లుగా తెలుస్తోందని MLC తీన్మార్ మల్లన్న ఆరోపించారు. తన కార్యాలయంపై దాడి చేసిన రౌడీలకు సమాచారాన్ని సీఐ ముందే ఇచ్చారని, తను అధికారిగా ఉన్నప్పుడే మూడుసార్లు తమ కార్యాలయంపై దాడి జరిగినట్లు చెప్పుకొచ్చారు. మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి కాల్ లిస్ట్ బయటకు తీస్తే మొత్తం బండారం బయటపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్