ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నేతలు తీవ్ర హెచ్చరికలు

తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రెండో పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, పీఆర్‌సీ కాలాన్ని పొడిగించొద్దని స్పష్టం చేశారు. పీఆర్‌సీ నివేదికను వెంటనే ప్రకటించి, జూన్ 2లోపు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన రూ. 700 కోట్లు సరిపోవని, వాస్తవ అవసరం రూ. 1500 కోట్లకు పైగా ఉందని తెలిపారు. ప్రతి నెల సుమారు 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బకాయిలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్