ఎల్బీనగర్‌: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు యువకులు మృతి

భూదాన్‌ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ వద్ద శనివారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి మునగడంతో ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేశ్‌, వంశీ, బాలు, వినయ్‌గా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉండగా ఒకరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్