ఎల్బీనగర్: రెచ్చిపోతున్న పెట్రోల్ దొంగలు

పొట్ట కూటికి కోటి ఉపాయాలు ఉన్నాయంటారు పెద్దలు. దొంగలు కూడా అదే సామెతను ఫాలో అవుతున్నట్టున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న బాపతు కూడా అదే. పెట్రోల్‌ను చోరీ చేస్తున్న సీన్ ఇది. ఎల్బీ నగర్‌లోని సిరి నగర్ కాలనీలో గత కొంతకాలంగా ఈ వ్యవహారం సాగుతోంది. బైకుల్లో పెట్రోల్ పోతుండడంతో స్థానికుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల భయం లేకపోవడంతో పెట్రోల్ దొంగల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాఫీగా సాగుతోంది.

సంబంధిత పోస్ట్