రంగారెడ్డి జిల్లా మైనింగ్ ఏడీ, నమిశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్షర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థకు అనుమతులకు మించి మట్టి తవ్వకాలు జరిపినందుకు రూ. 78,59,775 జరిమానా విధించింది. సరూర్నగర్ మండలం, మన్సూరాబాద్ రెవెన్యూ పరిధిలో ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో, 2024 జూన్ 21న పరిశీలించి ఆగస్టులో జరిమానా విధించారు. అయితే, రెండేళ్లు గడుస్తున్నా జరిమానా వసూలు చేయడంలో మైనింగ్ శాఖ విఫలమైంది. ఈలోగా, సంస్థపై అక్రమ గ్రావెలింగ్తో పాటు టీపీ లేకుండానే మట్టిని బహిరంగంగా అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. స్థానికులు మళ్లీ ఫిర్యాదు చేయడంతో, అక్టోబర్ 25న జీహెచ్ఎంసీ, తహసీల్దార్, ఎస్హెచ్వోలకు చర్యలకై లేఖలు రాసినా, అధికారులు ముడుపులు అందుకుని ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.