ఎల్బీనగర్‌: ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

ఎల్బీనగర్‌లో నిర్మాణంలో ఉన్న సెల్లార్ కూలిపోయి ముగ్గురు మృతి చెందారు. ఒక మృతదేహని ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు బయటికి తీశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పైనుండి మట్టి దిబ్బలు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా బీహార్‌కు చెందిన కూలీలు. ఒకరు తీవ్రంగా గాయపడటంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్