బాలాపూర్ మండలం జల్పల్లికి చెందిన మహ్మద్ రషీద్ ఖాన్, రహీంఖాన్లు 2019 జనవరి 9న ద్విచక్రవాహనంపై గంజాయిని రవాణా చేస్తూ సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి స్కూటర్ డిక్కీలో సుమారు కిలోన్నర ఎండు గంజాయి పొడి లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి వారిని రిమాండుకు తరలించారు. శుక్రవారం కేసు విచారించిన జిల్లా 13వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ఎం. వాణి, ఇద్దరు నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 25 వేల చొప్పున జరిమానా విధించారు.