కల్వకుర్తి నియోజకవర్గంలోని మర్రి గుంత తండాకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ గుండె ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శనివారం ఆయనను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అనంతరం కుప్పగండ్ల గ్రామంలో మృతి చెందిన కుమార్ కుటుంబాన్ని పరామర్శించి ఐదువేల రూపాయల సహాయాన్ని అందజేశారు.