గ్రామాభివృద్ధికి సమిష్టి కృషే కీలకం.. సర్పంచ్

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం కడ్తాల్‌లోని రావిచేడ్ గ్రామంలో 8వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శుక్రవారం భూమి పూజ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ బొప్పిడి గోపాల్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕