పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ నిరసన

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సీపీఐ పార్టీ ఆదిభట్ల సర్కిల్ సమితి కార్యదర్శి కాటంరాజు గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓరుగంటి యాదయ్య మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లాభాలు కట్టబెట్టడానికే ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని ఆరోపించారు. 2014లో పెట్రోల్ 62, డీజిల్ 55, వంటగ్యాస్ 250-300 ఉండగా, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, వంటగ్యాస్ 1000 దాటిందని, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1600 నుండి 3000 దాటిందని తెలిపారు. యుద్ధాన్ని సాకుగా చూపి మోడీ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని విమర్శించారు. ఈ నిరసన రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, ఆదిభట్ల సర్కిల్‌లో జరిగింది.

సంబంధిత పోస్ట్