33కేవీ విద్యుత్ స్తంభాలను ఓ డిసిఎం ఢీకొట్టి బోల్తా పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గేటు వద్ద చోటు చేసుకుంది. పడకల్ వైపు నుంచి కోళ్ల లోడుతో హైదరాబాద్ వెళుతున్న డిసిఎం అతివేగంతో మూలమలుపు వద్ద బోల్తా పడింది. డిసిఎం డ్రైవర్ నర్సింహా, మరో ఇద్దరు రోషన్, లాలన్ తీవ్రంగా గాయపడ్డారు. స్తంభాలను ఢీకొట్టడంతో విద్యుత్ వైర్లు డిసిఎంపై పడ్డాయి. స్థానికుల సాయంతో డీసీఎంలో ఉన్న ముగ్గురిని బయటకు తీశారు.