తెలంగాణ రైజింగ్ వంద రోజుల ప్రణాళికలో భాగంగా జల్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో సిబ్బందికి శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు సిబ్బందికి బిపి, షుగర్, జ్వరం పరీక్షలను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ బి. వెంకట్రామ్ పర్యవేక్షణలో జరిగిన శిబిరంలో అన్ని విభాగాలకు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు.