గ్రామ పంచాయతీ ఎన్నికలు: రూ.5 లక్షల భీమాతో ఓటర్లను ఆకట్టుకుంటున్న సర్పంచ్ అభ్యర్థి

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ అభ్యర్థి పసుల వనమ్మ నరసింహ యాదవ్, తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల జీవిత బీమా, ఆడబిడ్డ పుడితే రూ.5వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, పెళ్లికి పుస్తెమట్టెలు, అబ్బాయి వివాహానికి రూ.5,116 ఇస్తానని హామీ ఇచ్చి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఆమె 15 హామీలతో కూడిన మేనిఫెస్టోను రూపొందించారు. నెలకోసారి మెడికల్ క్యాంపు, శస్త్రచికిత్సలకు రూ.15వేల సాయం, ఇల్లు కట్టుకునేవారికి రూ.21వేలు అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్