కడ్తాల్ మండలం రావిచేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయమ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ సాబేర్ ను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మహాత్మాగాంధీ గ్లోబల్ ఫ్మామిలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు సన్మానించారు. వ్యాయమ ఉపాధ్యాయుడిగా, మన ఊరు-మన బడి పథకంలో అందించిన సామాజిక సేవ, వ్యాయమ విద్య, పాఠశాల అభివృద్ధికి చేసిన కృషికిగానూ. శ్రీనివాస్ గుప్తా, సుజాత, ప్రభాకర్, గిరిబాబు, నర్సింహా చేతులమీదుగా మహాత్మాగాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పురస్కారం, ప్రశాంసా పత్రం అందుకున్నట్లు ఆయన తెలిపారు.