మహేశ్వరం: గృహిణి అదృశ్యం

గృహిణి అదృశ్యమైన ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన అస్లాం అన్సారీ తన భార్య నజ్మా కాతూన్, పిల్లలతో కలిసి ఎనిమిది నెలల క్రితం జీవనోపాధి నిమిత్తం జల్ పల్లి గ్రామానికి వలస వచ్చారు. ఈ నెల 11వ తేదీన ఉదయం పిల్లలతో కలిసి అస్లాం నిద్రిస్తుండగా, ఇంట్లో ఎవరికి చెప్పకుండా నజ్మా బయటికి వెళ్లిపోయింది. ఎంతకి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బీహార్ కు చెందిన సిరాజ్ అన్సారీ అనే వ్యక్తిపై అనుమానం ఉందంటూ బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్