శుక్రవారం బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి రావిర్యాలకు బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఏసీసీ ప్లాంట్ సమీపంలోకి చేరుకోగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న వ్యక్తులలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.