యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆమనగల్లుకు చెందిన నర్సింహ కుమారుడు పాతకోట యాదగిరి(35) తుక్కుగూడలోని మారుతీ షోరూం లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7న రోజు మాదిరిగానే విధులకు వెళ్లిన యువకుడు తిరిగి ఇంటికి రాలేదు. బంధువు జగన్ గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.