మైలార్‌దేవ్‌పల్లిలోని ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీకి సంకూరి జయప్రకాష్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు కొంపల్లి జగదీష్ శుక్రవారం శాలువా కప్పి సత్కరించారు. హౌసింగ్ సొసైటీ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.