ఆమనగల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ స్వర్ణకుమారి శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, పారిశుద్ధ్య పరిస్థితులపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధులకు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.