పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ షేక్ ముజీబ్ (24)కు ఎల్బీ నగర్ కోర్టు జీవిత ఖైదు విధించింది. పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో 2024లో జరిగిన ఈ ఘటనలో బాధితురాలు శిశువుకు జన్మనిచ్చింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, డీఎన్ఏ ఆధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేశారు. సోమవారం తీర్పు వెలువరించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు, నిందితుడికి సాధారణ జీవిత ఖైదుతో పాటు రూ.70 వేల జరిమానా విధించింది.