మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. 2014 నుంచి 2018 వరకు మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనను నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, అధికారులపై విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపుతోంది.