మేడ్చల్: విమానంలో ప్రాణాలు కాపాడిన డాక్టర్

విమానంలో అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడిని డాక్టర్ కాపాడారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో వృద్ధుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న డా. ప్రీతిరెడ్డి ఇది గమనించారు. వెంటనే అతడికి సిపిఆర్ చేశారు. స్పృహలోకి రావడంతో గమ్యస్థానానికి చేర్చారు. ప్రీతిరెడ్డి చొరవ పట్ల ఇతర ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ డాక్టర్ ఎవరో కాదు మన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలే.

సంబంధిత పోస్ట్