హైదరాబాద్‌: విషాదం.. లిఫ్ట్ కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్‌లోని సూరారంలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఆదివారం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న అక్బర్ (39) లిఫ్ట్ గుంతలో బాల్ పడగా తలను వంచి బాల్‌ను తీసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా రావడంతో దాని కింద పడి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్