వ్యక్తిని రాయితో కొట్టి హత్య చేసిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. వెంకట్రామిరెడ్డి నగర్ కాలనీకి చెందిన పోచయ్య(45)వద్ద మధ్యప్రదేశ్‌కి చెందిన ధర్మేంద్ర పని చేస్తున్నాడు. అతడికి పోచయ్య రూ.100 ఇవ్వాల్సి ఉండగా అడిగాడు. పోచయ్య డబ్బులు ఇవ్వకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తుమ్మ చెరువు సమీపంలో లేబర్ అడ్డా వద్ద పోచయ్యను ధర్మేంద్ర రాయితో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదైంది.